జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 13 : సిద్దిపేట జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు దళిత బంధు ఇవ్వాలని, దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రతీ నెల 5 నుంచి 10వ తేది వరకు పింఛన్లు ఇప్పించాలని, జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసిన వారికి ఉపకరణాలు విడుదల చేసి
 అర్షులైన ప్రతి దివ్యాంగులకు నేల కొత్త పింఛన్ ఇవ్వాలని, అర్షులైన ప్రతి దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి సొంత స్థంలం ఉన్న వారికి అర్థిక సహాయం అందించాలన్నారు. పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్,వికలాంగుల జెఏసీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ తెలంగాణ వికలాంగుల వేదిక  చుంచనకోట నగ్రామ అధ్యక్షుడు దొడ్డి మల్లేశం, సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు ఆరుగొండ మల్లేశం,రాజేష్ దివాకర్,మాచర్ల సంపత్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.