జిల్లాలో 216 శాటిలైట్ పాఠశాలల ఏర్పాటు
రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రమేష్
శ్రీకాకుళం, జూలై 26 : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో 216 శాటిలైట్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాజీవ్ విద్యా మిషన్ (రావివి) రాష్ట్ర కో-ఆర్డినేటర్ జి.వి.రమేష్, జిల్లా ఏఎంవో శ్రీనివాసం తెలిపారు. మెళియాపుట్టి మండలకేంద్రంలోని కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాలను వీరు సందర్శంచారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌళికవసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం చేయాల్సిన పనులను గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గతంలో ఉన్న ప్రత్యామ్నాయ పాఠశాలలు రద్దు చేస్తూ వాటి స్థానంలో శాటిలైట్ పాఠశాలలను ఈ ఏడాది నుంచే అమలు చేసేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 1 నుంచి 5 తరగతులకు విద్యాబోధన ఉంటుందని వారు పేర్కొన్నారు.