జిల్లాల పునర్వ్యస్థీకరణ అభ్యంతరాలు
పరిశీలిస్తున్నామన్న అధికారులు
విజయవాడ,ఫిబ్రవరి23 (జనం సాక్షి): జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాప్ట్ నోటిఫికేషన్ ఇచ్చామని ప్రణాళిక విభాగం ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు నెల సమయం ఇచ్చామన్నారు. ప్రాథమిక స్థాయిలో జిల్లాలవారిగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. మార్చి 10 వరకూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజయ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మార్చి 10న నివేదికతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తాం. ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. ఉద్యోగులు, వనరుల విభజనపైనా అధ్యయనం జరుగుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాక ఉద్యోగులు, జోనల్ విభజన. ప్రస్తుతం ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాల విభజన చేయడం లేదు‘ అని విజయ్‌కుమార్ వెల్లడిరచారు.