జిల్లా ఆర్ఎంపీ సంఘ అధ్యక్షునిగా రవీందర్ రెడ్డి

తిమ్మాపూర్, అక్టోబర్ 21 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా పొరండ్ల కి చెందిన కాసం రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కరీంనగర్ లో జిల్లా అసోసియేషన్ నూతన్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెన్నమాధవుని నరసింహారాజు, కోశాధికారిగా యాదగిరి సంపత్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొంతుల మనోహర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో అసోసియేషన్ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాబోవు రోజుల్లో అసోసియేషన్ నూతన భవన నిర్మాణ ఏర్పాటుతో పాటు సంఘంలోని సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా సంఘ పటిష్టతకు అందరూ సహకరించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తోపాటు కోశాధికారులను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిదులు బెజ్జంకి రవీందర్, మిట్టపల్లి రాజమౌళి, జిల్లా ప్రతినిధులు, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.