జిల్లా కొత్త కలెక్టర్‌గా క్రిస్టినా

నిజామాబాద్‌, జూలై 27 : జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎండిగా ఆయను బదిలీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా 2001 ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన క్రిస్టినా (36)ను బదిలీ చేశారు. ప్రస్తుతం సెలవులో ఉంటూ పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తోంది.
2010 ఫిబ్రవరి 27న కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరించిన వరప్రసాద్‌ గత 29 నెలలుగా జిల్లా అభివృద్ధికి సాయశక్తుల కృషి చేశారు. స్థానిక సంస్థలైన గ్రామ పంచాయితీ, మండల, జిల్లా పరిషత్తుల పదవి కాలం ముగిసిన తరువాత ప్రత్యేక పాలనలో కలెక్టర్‌ తనదైన శైలిలో అధికారులను, ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించి అభివృద్ధి పనులను చేపట్టారు. కొత్తగా కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరిచించిన సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. అదే విధంగా రైతులకు గిట్టుబాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర సౌకర్యాల కోసం అహర్నిశలూ కృషి చేసి అధికారులను అప్రమత్తం చేశారు. కాగా జిల్లాలో జోరుగా జరుగుతున్న ఆక్రమ ఇసుక వ్యాపారం, ఆక్రమ మద్యం విషయంలో వచ్చిన పలు ఆరోపణలు ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

తాజావార్తలు