జీవో నెంబర్ 46 నుంచి టిఎస్ఎస్పి పోలీస్ కానిస్టేబుల్ భర్తీ మినహాయింపు ఇవ్వాలి

– దళితుల ఉపాధి కోసం ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలి

– అసెంబ్లీ సమావేశాల్లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 

జనంసాక్షి, మంథని : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి టిఎస్ఎస్పి
సంబంధించి మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని, జీవో నెంబర్ 46 ప్రకారం చేస్తే చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మినహాయించాలని కోరారు. పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి మండల జిల్లా మహిళా సమైక్యకు సంబంధించిన ఉద్యోగులు అకౌంటెంట్లు, ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, దాదాపు 1542 మంది ఉద్యోగులను ప్రధానంగా మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా వారు అనేక సందర్భాల్లో ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు.. వారి గురించి, వారి సంక్షేమం గురించి తప్పకుండా ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దళితుల ఉపాధి కోసం ఆ రోజుల్లో 2011-12 / 12- 13 సంవత్సరాల్లో రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చారు అని, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వారు ఇబ్బoదులతో కట్టలేక పోయినందున రుణమాఫి చేయాలని కోరారు.

తాజావార్తలు