జీహెచ్‌ఎంసీ అప్రమత్తం
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం కావడం, నాలాలు పొంగిపొర్లడం, ట్రాఫిక్ ఇబ్బందులపై గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్రమత్తమయింది. ఆయా జోన్లలో ఉన్న డిప్యూటీ కమిషనర్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశాలిచ్చింది. డ్రైనేజీ, ట్రాఫీక్…. తదితర సమస్యలపై ఫిర్యాదుల్ని స్వీకరించాలని ఇంజనీర్ ఇస్ చీఫ్ ధన్‌సింగ్ కంట్రోల్‌రూంలకు అదేశాలిచ్చారు. మరో 48 గంటలపాటు వర్షాలు కొనసాగే అవకాశమున్నందున పూర్తిస్తాయిలో అప్రమత్తంగా వుండాలని కమిషనర్ కృష్ణబాబు ఆదేశాలు జారీచేశారు.