జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫిషిియో సభ్యులుగా ఎమ్మెల్సీలు
– ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్,ఫిబ్రవరి 4(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎక్స్‌ఆఫీషియో సభ్యులకు సంబంధించి ఆర్డినెన్స్ జారీపై ముందడుగు పడింది. గ్రేటర్ హైదరబాద్ నగరపాలక సంస్థ ఎక్స్‌అఫీ షియో సభ్యులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు ఉండనున్నారు. ఎమ్మెల్సీలను జీహెచ్‌ఎంసీ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పరిగణించే ఆర్డినెన్స్‌కు గవర్నర్ నరసింహన్ ఇవాళ ఆమోదం తెలిపారు. 207 జీవో స్థానంలో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చారు.
హైకోర్టులో జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో కేసు విచారణ
జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ఏజీ మాట్లాడుతూ… చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. రెండేళ్ల వరకూ ప్రభుత్వమే చట్టాన్ని సవరించుకోవచ్చన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఈ వెసులుబాటు ఉందని న్యాయస్థానానికి వివరించారు. అయితే చట్టాన్ని సవరించుకునే అధికారం ప్రభుత్వానికి ఒక్కసారి మాత్రమే ఉందని పిటిషనర్లు వాదించారు. ఒకసారి సవరించాక చట్టసభల్లో ఆమోదించాల్సిందేననిపేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.