జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు కుదరదు
– హై కోర్టు
హైదరాబాద్,జనవరి 7(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ జారీచేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ కోసం గడువు విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. శనివారంలోగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలంగాణ అడ్వకేట్ హైకోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లు ఖరారైన 31 రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు సరికాదంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల పక్రియను ఎందుకు కుదించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ ఎందుకు తసుకురాలేదని కోర్టు అడిగింది. జనవరి 31 లోగా ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో ఎన్నికల పక్రియను కుదించామని ఏజీ సమాధానమిచ్చారు. అయితే ఎన్నికలు ఎన్నిరోజుల్లోగా నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, అవసరమైతే రెండు, మూడు వారాలు గడువు పొడగిస్తామని స్పష్టం చేసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పాత పద్దతినే అవలంభించాలని హైకోర్టు ఆదేశించింది.శనివారం లోపు వార్డుల రిజర్వేషన్ లు ప్రకటించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.ఎన్నికల పక్రియ గడువును తగ్గించరాదని హైకోర్టు స్పష్టం చేసింది.నెల రోజుల లోపు అంటే ఫిబ్రవరి తొమ్మిదో తేదీలోగా అంటే ముప్పై ఒక్క రోజుల కాల పరిమితిని హైకోర్టు విధించింది.కుదింపుపై సంక్రాంతి సెలవుల తరవాత విచారణ చేపడతామని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయం అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల పక్రియ సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని , వార్డుల రిజర్వేషన్ లను రహస్యం గా ఉంచిందని ఆయన అన్నారు. ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా రిజర్వేషన్ ల సమాచారం టిఆర్‌ఎస్ కు మాత్రమే తెలుసునని, మిగిలిన పార్టీలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించారని అన్నారు. వార్డుల రిజర్వేషన్ పై ఆడ్వకేట్ జనరల్ చేసిన వాదన కూడా గందరగోళంగా ఉందని, ఈ కేసును వాదించిన న్యాయవాది జంద్యాల రవిశంకర్ అన్నారు. రెండుసార్లు రెండు రకాలుగా ఆడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారని అన్నారు. తాము నలభై ఐదు రోజుల గడువు కోరామని,హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దాదాపు నలభై రోజుల వరకు వచ్చే అవకాశం ఉందని అన్నారు.టిఆర్‌ఎస్ మొత్తం ఇరవై రోజులలో ఈ పక్రియను పూర్తి చేయడానికి జి.ఓ ఇచ్చిందని,దానిని హైకోర్టు అంగీకరించలేదని ఆయన అన్నారు.
గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు అభ్యంతరం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పక్రియ ను ఎందుకు కుదించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల పక్రియ గడువు తగ్గించడంపై ఆడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించగా, జనవరి ముప్పై ఒక్కటో తేదీ లోగా పక్రియ ముగించాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన వివరణ ఇచ్చారు.గతంలో రెండుసార్లు హైకోర్టు గడువు పెట్టినా ప్రభుత్వం అమలు చేయలేదని బెంచ్ ప్రస్తావించడం విశేషం.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటిలోగా పూర్తి చేయాలను కుంటున్నారో చెబితే , దానికి అనుగుణంగా నిర్ణయం చెబుతామని హైకోర్టు న్యాయమూర్తులుపేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికల పక్రియను ఎందుకు కుదించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ ఎందుకు తసుకురాలేదని కోర్టు అడిగింది. జనవరి 31 లోగా ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో ఎన్నికల పక్రియను కుదించామని ఏజీ సమాధానమిచ్చారు. అయితే ఎన్నికలు ఎన్నిరోజుల్లోగా నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, అవసరమైతే రెండు, మూడు వారాలు గడువు పొడగిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ 21 రోజుల నుండి 15 రోజులకు తగ్గించారు. డేట్ ను పొడిగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. . టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎత్తుగడల్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకు డివిజన్ ల వారీగా రిజర్వేషన్ లు ప్రకటించలేదని పిటిషనర్ తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. అభ్యర్థులను సెలక్ట్ చేసేందుకు తమకు 45 రోజుల సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేశామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వివరించారు. షెడ్యూల్ కుదింపు సరైంది కాదేమోనని ధర్మాసనం అభిప్రాయపడింది.ఇదిలా వుండగా హైకోర్టు తీర్పు కనువిప్పు కావాలని ఉత్తవమ్ కుమార్ రెడ్డి అన్నారు. గేటర్ హైదరాబాద్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్వాగతిస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డివిజన్ల రిజర్వేషన్ల ముసాయిదా ముందుగా విడుదల చేసి, పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే వాటిని ఖరారు చేయాలని సూచించారు. రిజర్వేషన్లు ప్రకటించాక నామినేష్ల దాఖలకు కనీసం వారం రోజుల గడువు ఉండాలన్నారు. షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టని అన్నారు. రిజర్వేషన్లు ఖరారు, నామినేషన్లు దాఖలు చేయడానికి మధ్య వారం గడువు లేకుంటే పార్టీలో చర్చించి ఎన్నికల బహిష్కరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తీరు మయన్మార్, పాకిస్థాన్ లో ఎన్నికల నిర్వహణ మాదిరిగా ఉందని విమర్శించారు. ‘గ్రేటర్’ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.