జీహెచ్‌ఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఓల్డ్ ఆల్వాల్‌లోని జీహెచ్‌ఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 50 తులాల బంగారం, 12 ఎకరాల భూమి, రూ.3 లక్షల నగదు, 8 ఫ్లాట్లు, రెండు ఇళ్లులతో కలిపి మొత్తం రూ.5 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో మొత్తం ఐదు చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతోన్నాయి. కృపాదానంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు.