జీ 20 శిఖరాగ్రసదస్సుకు ఢల్లీి సిద్ధం

` హస్తినకు చేరిన జో బైడెన్‌
` నేటినుంచి జి`20 శిఖరాగ్ర సదస్సు
` ముస్తాబైన దేశ రాజధాని
` పలు దేశాల నేతల రాకతో హడావిడి
` భారీగా బందోబస్తు కల్పించిన ప్రభుత్వం
` ఢల్లీి చేరుకున్న రుషి సునాక్‌
` భద్రత గుప్పిట్లో ఢల్లీి నగరం
` వాహనాల రాకపోకలపై నిషేధం
` రెండ్రోజుల సదస్సుకు భారీ భద్రత
న్యూఢల్లీి(జనంసాక్షి): రెండ్రోజుల పాటు జరిగే జి`20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది.  శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ రాజధాని ఢల్లీిసర్వాంగసుందరంగా దర్శనిమస్తోంది. ఈ సదస్సుకు జి 20 దేశాధినేతలు, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఉన్నతాధికారులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. వసుధైక కుటుంబం అనే థీమ్‌తో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశానికి హజరవుతున్న ప్రముఖల్లో అమెరికా అధ్యక్షలు జో బైడెన్‌, చైనా ప్రధానమంత్రి లి కియాంగ్‌ ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ సమావేశంలో పాల్గొన లేనని ఇప్పటికే ప్రకటించారు. రష్యా నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ప్రాతినిధ్యం వహిస్తారని పుతిన్‌ చెప్పారు. కెనాడా, ఇంగ్లాండ్‌ ప్రధాన మంత్రులు జస్టిన్‌ ట్రూడో, రిషి సునక్‌ హాజరుకానున్నారు. జి 20 చర్చలతో పాటు, యుకె`ఇండియా వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రత్యేక చర్చలల్లో మోడీతో సునక్‌ పాల్గొంటారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, జపాన్‌ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్టేల్రియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా అధ్యక్షులు యున్‌ సుక్‌ యోల్‌ హాజరుకానున్నారు. ఫ్రాన్స్‌ నుంచి ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ఈ సదస్సులో పాల్గొననున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వీరంతా రాత్రి కల్లా న్యూఢల్లీి చేరుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు..ఈ సమావేశంలో సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, ఇండోనేషియా, బ్రెజిల్‌ వంటి దేశాలు పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుంది.ప్రగతి మైదాన్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన ’భారత్‌ మండపం’ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ సమావేశానికి ప్రధాన వేదికగా నిలవనుంది. ఎటుచూసినా  భారీ హౌర్డింగ్‌లు, లైటింగ్స్‌ ఏర్పాటు చేశారు. భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ సదస్సులో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై వివిధ దేశాల నేతలు చర్చలు జరపనున్నారు. శుక్రవారమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, పలు దేశాల అధినేతలు పలువురు వస్తుండడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ జో బైడెన్‌ మధ్య ద్వైపాక్షికసమావేశం జరగనుంది. నగరంలో మూడు రోజు పాటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వీధులను కుడ్య చిత్రాలు, బ్యానర్లు, ఫౌంటైన్లు, మొక్కలతో అలంకరించారు. విదేశీ అతిథులతో కమ్యూనికేట్‌ చేయడానికి 100 మంది మహిళా పారిశ్రామిక వేత్తలను చాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండిస్టీ (సిటిఐ) నియమించుకుంది. వీరంతా ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, తదితర భాషలను అనర్గళంగా మాట్లాడతారని సిటిఐ చైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మహిళల జాబితాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు చెప్పారు. అలాగే గురుగ్రామ్‌ జిల్లాలో ఈ నెల 8 నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని ఉద్యోగులను ఆదేశించాలని అన్ని కార్యాలయాలకు ఆ జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లాలోని అన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ కార్యాలయాలకు ఈ మేరకు సలహాను జారీ చేసింది.
ఢల్లీి చేరుకున్న రుషి సునాక్‌
సెప్టెంబర్‌ 9,10వ తేదీల్లో ఢల్లీి వేదికగా జి20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ దేశాధినేతలు ఢల్లీికి చేరుకుంటున్నారు. ఇంగ్లండ్‌ ప్రధాని రుషి సునాక్‌ రాజధానికి చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికారు. జి20 సదస్సు నేపథ్యంలో భద్రత కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల సెక్యూరిటీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. సమావేశాలు జరిగే వేదిక సవిూపంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తోంది. ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు నిఘా నీడలోనే ఉండనుంది. గూడ్స్‌ వెహికిల్స్‌ తిరగకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. ట్యాక్సీలు, ఆటోలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఢల్లీి ప్రభుత్వం ఓ గెజిట్‌ విడుదల చేసింది. మొత్తం నగరాన్ని రక్షిత జోన్‌గా ప్రకటించింది. కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినివ్వనుంది. హౌజ్‌ కీపింగ్‌, క్యాటరింగ్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్స్‌కి సంబంధించిన వెహికిల్స్‌కి ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్‌తో పాటు, మార్కెట్‌లను పూర్తి స్థాయిలో రెండు రోజుల పాటు మూసివేయ నున్నారు. ఈ కంట్రోల్డ్‌ జోన్‌లోకి ప్లిప్‌కార్ట్‌,అమెజాన్‌తో పాటు స్విగ్గీ, జొమాటోలకూ అనుమతి లేదు. మెక్సికన్‌, యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు ఢల్లీికి రానున్నారు. అయితే…ఎక్కువ మంది అధినేతలు, ప్రతినిధులు మాత్రం రేపు వచ్చేందుకు ఎª`లాన్‌ చేసుకున్నారు. విఐపిలను ఆహ్వానించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. వీవీఐపీల విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు పాలం టెక్నికల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు చేశారు. అతిథులకు ప్రత్యేక శాకాహార వంటలు తయారు చేయనున్నారు. బంగారం, వెండి పాత్రల్లో అతిథులకు వడ్డించనున్నారు. వెండి గ్లాస్‌లపై జాతీయ పక్షి అయిన నెమలిని చెక్కించారు. వీటితోనే డ్రిరక్స్‌ అందించనున్నారు. జీ`20 సదస్సుకు హాజరు కాబోతున్న వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతల సతీమణులకు ప్రత్యేక విందు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఢల్లీిలోని జైపుర్‌ హౌస్‌లో స్పెషల్‌గా మధ్యాహ్న విందు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెనూలో చిరు ధాన్యాల ఆహార పదార్థాలను కూడా చేర్చారు. నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ కు కేంద్రమైన జైపుర్‌ హౌస్‌లో ప్రత్యేక పెయింటింగ్స్‌, పేరొందిన శిల్పాలు, అద్భుతమైన ఫొటోలతో పాటు అనేక రకాల కళాకృతులు ఉన్నాయి.
దిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌
దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఆయనకు స్వాగతం పలికారు.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. జో బైడెన్‌ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు.జేఈ జెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్‌, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు కూలంకషంగా చర్చించనున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ ఇదివరకే విూడియాకు వెల్లడిరచారు. ద్వైపాక్షిక భేటీ పూర్తయిన తర్వాత ఐటీసీ మౌర్యాలో జో బైడెన్‌ బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లను ఇప్పటికే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ హోటల్‌ 14 వ అంతస్తులో బైడెన్‌ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్‌ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ హోటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్‌ చేశారు.జో బైడెన్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ఇటీవల కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత్‌ పర్యటనకు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం బైడెన్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా వైరస్‌ నెగెటివ్‌గా తేలింది. మంగళవారం మరోసారి టెస్టులు చేయగా.. మళ్లీ నెగెటివ్‌గానే నిర్ధారణ అయ్యింది. దీంతో బైడెన్‌ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్వేతసౌధం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌లో జరిగే జీ`20 సదస్సుకు బైడెన్‌ హాజరవుతారని స్పష్టం చేసింది.
పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు
రెండు రోజుల పాటు జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ 15కి పైగా  ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు.  అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సహా పలు దేశాల అధ్యక్షులతో ప్రధాని చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలతో ప్రధాని మోడీ తన అధికారిక భవనంలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడిరచాయి. అలాగే మారిషన్‌ అధినేతతో కూడా సమావేశం కానున్నారు. శనివారం జి20 శిఖరాగ్రసదస్సులో పాల్గొన్న  అనంతరం బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, ఇటలీ అధ్యక్షులతో చర్చించనున్నారు. శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే జి20 శిఖరాగ్ర సదస్సు కోసం న్యూఢల్లీిలోని ప్రగతి మైదాన్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన భారత్‌ మండపం కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. దీంతో ఢల్లీిలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు. రాజధాని సరిహద్దులను మూసివేయడంతో పాటు నగరంలో మూడు రోజుల పాటు పాఠశాలలు, కార్యాలయాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.  సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మొత్తం 15 రౌండ్ల చర్చలు జరగనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మారిషస్‌, బంగ్లాదేశ్‌ సహా అమెరికా ప్రతినిధులతో చర్చించనున్నారు. లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలోనే ఈ భేటీ జరగనుంది. యూకే, జపాన్‌, జర్మనీ, ఇటలీ నేతలతో సమావేశం కానున్నారు ప్రధాని. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ప్రధాని భేటీ అవుతారు. ఇదే సమావేశంలో బంగ్లాదేశ్‌ ప్రధాని కూడా హాజరు కానున్నారు. సెప్టెంబర్‌ 10వ తేదీన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో లంచ్‌ విూటింగ్‌ షెడ్యూల్‌ చేశారు. అదే సమయంలో కెనడా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొమొరోస్‌, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్‌ యూనియన్‌, బ్రెజిల్‌, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యురోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన కీలక నేతలు ఉ20 ªూబీపపతిబి కి హాజరు కానున్నారు. ఇప్పటికే ఢల్లీిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు. విమెన్‌ స్నైపర్స్‌ తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢల్లీి పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. దాదాపు 50 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి హోటల్స్‌ వరకూ హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌తో పాటు కేంద్ర సంస్థలు ఢల్లీి పోలీసులకు సహకరిస్తున్నాయి.