జుకర్‌బర్గ్ దంపతుల ఆసక్తికరమైన పోస్ట్
ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు మళ్ళి పాప పుట్టింది. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ సోమవారం(ఆగస్ట్ 28న) మరో పండంటి పాపకు జన్మనిచ్చింది. జుకర్ దంపతులు ఆ పాపకు ‘ఆగస్ట్’ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఆనందకర విషయాన్ని జుకర్ తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి ఆగస్ట్‌కు ప్రేమతో జుకర్ లేఖ రాశారు.
‘డియర్ ఆగస్ట్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. నీకోసం మీ అమ్మా, నేను ఎంతో ఆతృతగా ఎదురుచూశాం. మీ అక్క మాక్స్ పుట్టినప్పుడు కూడా మేం ఇంతే ఆనందంగా ఉన్నాం. అప్పుడు కూడా ఇలాగే లేఖ రాశాం. నువ్వు మంచి విద్య, బలమైన బంధాలు, సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగాలని ఆశిస్తున్నాం. ఈ శాస్త్రసాంకేతిక కాలంలో మీరు మాకన్నా మంచి జీవితాన్ని అనుభవిస్తారని తెలుసు. అయితే దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మాపైనే ఉంది. బాల్యం చాలా అద్భుతమైనది. అది ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ఆ బాల్యాన్ని నువ్వు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అనుభవించాలి. మేం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని జుకర్ రాసుకొచ్చారు. చిన్నారి ఆగస్ట్ జుకర్‌కు రెండో సంతానం. 2015లో జుకర్‌బర్గ్‌కు మాక్స్ జన్మించింది