జులై 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

2

న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి):

జూలై21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. లలిత్‌మోడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షలు సిద్ధంగా ఉన్నాయి. విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇస్తామని ప్రభుత్వంలో మంత్రులు ధీమాగా ఉన్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి. ఇప్పటికే భూసేకరణ చట్టంపై వివాదం ఉండగా తాజాగా లలిత్‌ మోడీ విషయంలు సుష్మ, వసుంధరల రాజీనామాకు పట్టుబట్టేందుకు విపక్షాలు సిద్దంగా ఉన్నాయి. తాజాగా స్మృతి ఇరానీ విద్యార్హతలపైనా వివాదాలు చుట్టుముట్టాయి. ఇదిలావుంటే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం సమావేశమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఇకపోతే లలిత్‌మోదీ వివాదంలో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. సుష్మాస్వరాజ్‌ సహా కేంద్ర మంత్రులెవరూ రాజీనామా చేయనక్కర్లేదన్నారు. లలిత్‌మోదీ వివాదంతో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలసిందే. వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజావార్తలు