*జూనియర్ సివిల్ జడ్జిగా ప్రియాంక సేవలు అభినందనీయం*

కోదాడ, ఆగస్టు 28(జనంసాక్షి)
కోదాడ కోర్టులో గత ఐదున్నర సంవత్సరాలుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న బి. ప్రియాంక  గజ్వేల్ కు బదిలీ అయ్యారు. కాగా ఆదివారం కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ పబ్లిక్ క్లబ్ లో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యన్. శ్యాంసుందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసుల పరిష్కారంలో ప్రియాంక సేవలు అభినందనీయం అన్నారు. న్యాయవాద వృత్తిలో పారదర్శకంగా పనిచేస్తూ న్యాయవాదుల, కక్షిదారుల ఆదరాభిమానాలు పొందారన్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి న్యాయవాద వృత్తిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో, మెమెంటాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార అసోసియేషన్ అధ్యక్షులు దేవబత్తిని నాగార్జునరావు, ప్రధాన కార్యదర్శి సిలివేరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రహీం, జాయింట్ సెక్రటరీ నయీమ్, ట్రెజరర్ జానీ పాషా, లైబ్రరీ కార్యదర్శి మోష, క్రీడల కార్యదర్శి మురళి, సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్ ఆర్ కే మూర్తి, బొబ్బ కోటిరెడ్డి, ఎలకా సుధాకర్ రెడ్డి, శరత్ బాబు, మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వరరావు, ఏజీపీ శాస్త్రి, కే ఎల్ యన్ ప్రసాద్, గట్ల నరసింహారావు, నాలం రాజన్న, గాలి శ్రీనివాస్ నాయుడు, రామిరెడ్డి, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, ఉయ్యాల నరసయ్య, ఈదుల కృష్ణయ్య, ఆవుల మల్లికార్జున్, మురళి ,కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.