జూన్‌ 2లోగా ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్న కన్వీనర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జూన్‌ 2వ తేదీలోగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎంసెట్‌కు ఈ ఏడాది నుంచి రికార్డు స్థాయిలో నాలుగు లక్షల దరఖాస్తులు అందాయని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే మెడిసిన్‌ ఫలితాలు ఉంటాయని, విద్యార్థులు నీట్‌ కూడా రాయాలని ఎంసెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు.