జూలపల్లిలో జన జాతర

-టీఆర్‌ఎస్‌ సభ విజయవంతం
-ఆకట్టుకున్న అధినేత ప్రసంగం
-మార్మోగిన ‘జై తెలంగాణ’ నినాదం
-బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చిన మహిళాలోకం
-సభ ఏర్పాట్లపై కేసీఆర్‌ ప్రశంసల వర్షం
-పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
పెద్దపల్లి, జనంసాక్షి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జూలపల్లి మండలం కేంద్రంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన తెలంగాణవాదులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. జైతెలంగాణ నినాదాలతో ఆ ఫ్రాం తమంతా మార్మోగింది. ఇక్కడ గూలాబీ దళపతి కేసీఆర్‌ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆకట్టుకుంది. తెలంగాణకు జరుగుతున్న అన్నాయాలను వివరిస్తూ భవిష్యత్‌లో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎలాంటి ఉద్యమం చేయాలి ? ప్రజల నుంచి ఎలాంటి సహకారం కావాలి అన్నదానిపై కేసీఆర్‌ మాట్లాడిన తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.