జెఎన్‌టియుకెలో ఆహార పరిశోధన శాల
కాకినాడ, జూలై 30 : కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో ఆహార సాంకేతిక విశ్వ విద్యాలయ భవనానికి భూమి పూజ వైస్ చాన్సిలర్ తులసీరామ్‌దాస్ నిర్వహించారు. రైస్ మిల్లింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అవకాశాలు అనే అంశాలపై పారిశ్రామిక సదస్సులో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత దేశంలో నిధులకు కొరత లేదని ఆహార పరిశ్రమల్లో ఎక్కువగా ప్రొసెసింగ్, స్టోరేజీ కొరత ఉందని దీని నివారణకు ఆహార పరిశ్రమల శాఖ చేయూతనిస్తుందన్నారు.మిల్లింగ్ పరిశ్రమలు వీటిని ఉపయోగించుకోవాలని, శాస్త్రీయ విధానాలను అవలంభించాలని సూచిస్తూ ప్యాకేజింగ్, రైప్‌ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ డెవలప్‌మెంట్‌పై వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో సత్సంబంధాలు మెరుగుపరచి పరిశోధన విధానాలను పెంపొందించాలని సూచించారు. జెఎన్‌టియుకె వైస్ చాన్సిలర్ డాక్టర్ తులసీరామ్‌దాస్ జపాన్ దేశం బయోటెక్నాలజీని ఉపయోగిస్తూ తక్కువ వర్షపాతం, తక్కువ నేలలో పంటలు పండించే విధానాన్ని భారత దేశంలో అవలంభించే పద్దతులను సూచించారు. జెఎన్‌టియుకె ప్రాంగణంలో ఆహార పరిశోధన ప్రయోగశాల నిర్మిస్తున్నామని దీనికి కోటి పది లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇక నుంచి రైస్ మిల్లర్స్ ఆహార పరిశ్రమలు తమ శాంపిల్ టెస్టలను జెఎన్‌టియుకెలో పరీక్షించుకోవచ్చన్నారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర్లును, విసి తులసీరామ్‌దాస్‌ను సత్కరించారు.