జెఎసి కో- ఛైర్మన్‌గా నారాయణరావు

శ్రీకాకుళం, జూలై 28 : ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్‌దారుల ఐక్య కార్యచరణ కమిటీ (జెఎసి) కో-ఛైర్మన్‌గా పిఆర్‌ పద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావును నియమించారు. ఈ మేరకు జిల్లా జెఎసి అధ్యక్షుడు సాయిరాం నియామక ఉత్తర్వులు శనివారంనాడు విడుదల చేశారు. పిఆర్‌ ఉద్యోగుల సంఘం నాయకులు కె.మన్నదరావు జి.వి.రమణ తదితరులు హర్షం ప్రకటించారు.