జై కిసాన్..
గెలిచిన రైతు ఉద్యమం ` సాగుచట్టాలు వెనక్కు..
` పార్లమెంట్‌లో ప్రకటిస్తాం ` మోదీ సంచలన ప్రకటన
రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ ` రాజకీయపార్టీలు, రైతు సంఘాల హర్షం
నియంతల అహంకారం ఓడిరది : సోనియా గాంధీ
రైతుల సత్యాగ్రహం. కేంద్ర అహంకారాన్ని ఓడిరచింది
రైతులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
రైతులను అభినందించిన మమతా బెనర్జీ
సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా!
అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే మోదీ సాగు చట్టాల రద్దు
ప్రధాని నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్
సాగుచట్టాల రద్దును స్వాగతించిన టిఆర్‌ఎస్ పార్టీ
ప్రజాశక్తి ముందు ప్రభుత్వం తలవంచిందని వెల్లడి
మోడీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ తదితరుల స్పందన
న్యూఢల్లీి,నవంబరు 19(జనంసాక్షి): దేశ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతలు విజయం సాధించారు. రైతుల ఆందోళనలతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. సాగుచట్టాలు రద్దేచేయడంలో విజయం సాధించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు సాగుచట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో… మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను… ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తామని ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే సందర్భంలో రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చిన్న రైతుల కోసం అనేక పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉందని, అదే వారికి జీవనోపాధని అన్నారు. వ్యవసాయ బ్జడెట్‌ను 5 రెట్లు పెంచిన ఘటన తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూరల్ మార్కెట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. అంతకముందు ’ సిక్కుల మొదటి గురువు, సిక్కు మతస్థాపకులు గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.సుమారు సంవత్సర కాలం నుండి ఈ సాగు చట్టాలు రద్దు చేయాలని ఢల్లీి సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ చట్టాల రద్దు రైతుల విజయంగా భావిస్తున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్టాల్రకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నియంతల అహంకారం ఓడిరది: సోనియా
రైతులు, కార్మికులపై అధికారంలో ఉన్న వారి కుట్రలు చిత్తయ్యాయని, నియంత పాలకుల అహకారం ఓడిరదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. సత్యం, న్యాయం అహింస గెలిచాయని అభివర్ణించారు. వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ ప్రకటించడంపై ఆమె స్పందిస్తూ, రైతుల జీవనోపాథి, వ్యవసాయంపై దాడికి జరిగిన కుట్ర ఓటమి పాలైందని అన్నారు. ఇది అన్నదాతల విజయమని ఆమె అభివర్ణించారు.
రైతుల సత్యాగ్రహం.. కేంద్ర అహంకారాన్ని ఓడిరచింది:రాహుల్ గాంధీ
కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం.. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడిరచినట్లు రాహుల్ విమర్శించారు. ఏడాది కాలం నుంచి దేశవ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ ఆందోళనల్లో వందల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటన చేసిన తర్వాత.. రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో.. కేంద్ర సర్కార్ అహంకారాన్ని తలదించుకునేలా చేశారన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్, జై కిసాన్ అంటూ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్‌లో రాహుల్ షేర్ చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు. దేశంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయంపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు.అహంకారం ఓడిపోయింది, అన్యాయానికి వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినందుకు అభినందనలని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైతులకు అభినందనలు తెలిపారు. విూ పట్ల ప్రవర్తించిన క్రూరత్వానికి చలించకుండా అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇది విూ విజయం.. ఈ పోరాటంలో మరణించిన రైతుల నా ప్రగాఢ సానుభూతి‘ అని మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. మొత్తంవిూద సాగు చట్టాల రద్దుపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ రైతులను అభినందించారు.
సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా:ప్రియాంకా గాంధీ
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని విూరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేదెలా అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆమె విూడియాతో మాట్లాడారు. ప్రధాని ఎందుకు చట్టాలను రద్దు చేస్తున్నారు, ఎన్నికలు దగ్గరపడుతున్నాయన్న విషయం ప్రజలకు అర్థం కావడం లేదా, బహుశా వాళ్లకు పరిస్థితి అనుకూలంగా లేదని, సర్వేల్లో వాళ్లకు పరిస్థితి అర్ధమవుతోందని, అందుకే ఎన్నికల ముందు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రియాంకా ఆరోపించారు. రైతులు ఆందోళనజీవులను, గుండాలని, ఉగ్రవాదులని, దేశద్రోహులని ప్రభుత్వ నేతలు విమర్శలు చేశారని, అన్ని మాటలంటుంటే ప్రధాని ఎందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిరసన చేపడుతున్న రైతుల్ని ఆందోళనజీవులను ప్రధానియే స్వయంగా అన్నట్లు ప్రియాంకా ఆరోపించారు. రైతుల్ని చంపేశారని, వారిపై లాఠీలను వాడారని, అరెస్టులు చేశారని, ఇవన్నీ ఎవరు చేశారని ఆమె ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వమే చేసిందని ప్రియాంకా విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ ఆమె ప్రశ్నించారు. ఈ దేశంలో రైతుల కన్నా మిన్న ఎవరులేరన్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రియాంకా గాంధీ అన్నారు.
యూపి ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు: అఖిలేశ్
యూపీ సహా పలు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసిందని, ఎన్నికల తర్వాత మళ్లీ నల్లచట్టాలను తీసుకువస్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రైతులపై ప్రేమతో బీజేపీ సాగు చట్టాలను వెనక్కితీసుకోలేదని కాషాయ పార్టీ రైతులను మోసగిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ హృదయం పరిశుభ్రమైనది కాదని, సంపన్నుల కోసం పనిచేసే ఆ పార్టీ భూసేకరణ, నల్ల చట్టాలతో రైతులను దగా చేసేందుకు ప్రయత్ని స్తోందని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. రైతులను అవమానిస్తూ వారిని కార్లతో తొక్కించిన బీజేపీ పూర్వాంచల్‌లో ఎస్పీ విజయ్ యాత్రకు లభించిన ప్రజల మద్దతు చూసి బెంబేలెత్తి సాగు చట్టాలను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. వందలాది రైతుల మృతికి కారణమైన దోషులను ఎప్పుడు శిక్షిస్తారో బీజేపీ ప్రజలకు బదులివ్వాలని అఖిలేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై యూపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వెల్లడిరచాలని నిలదీశారు. ప్రధాని మోదీ యూపీలో శుక్రవారం పర్యటిస్తున్న ప్రాంతంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు వెలుగుచూశాయని అన్నారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు వెనక బీజేపీ ఉద్దేశాన్ని కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. కీలక రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాలను రద్దు చేశారని ఆ పార్టీ ఆరోపించింది.
సాగుచట్టాల రద్దును స్వాగతించిన టిఆర్‌ఎస్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ స్పందించింది. ఇది ప్రజా విజయమని వ్యాఖ్యానించింది. దీనిపై మంత్రులు స్పందించి మోడీ దిగిరాక తప్పలేదన్నారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతుల చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ ముందున్న విషయం తెలిసిందేనని అన్నారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన కూడా చేపట్టింది. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆ కామెంట్‌కు ఆయన విజయసూచిక ఉన్న ఎమోజీని కూడా పోస్టు చేశారు. జైకిసాన్, జై జవాన్ అంటూ తన ట్వీట్‌లో మంత్రి కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్, టీఆర్‌ఎస్ విత్ ఫార్మర్స్, ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా మంత్రి తన ట్వీట్‌లో పోస్టు చేశారు. రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతుశక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయమని ట్వీట్ చేశారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’ అని మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో పోస్టు చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. రైతులకు మద్ధతుగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమసెగ ఢల్లీికి తగిలిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారికోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు అభినందనలు తెలిపారు. సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ªుద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన పోరాడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఈ భయంతోనే వివాదాస్పద చట్టాలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారని తాము భావిస్తున్నామన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకుండానే ఇన్ని రోజులు సాగాయని, కేసీఆర్ చేపట్టిన మహాధర్నా.. రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోదీ నమ్మారని తెలిపారు. ఈ సెగ ఢల్లీి వరకు చేరుతుందనే భయంతోనే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన టీఆరెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. సాగు చట్టాలను కేందప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులుబాసిన రైతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి మించి మరేదాన్ని పాలకులు ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్లేదన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నా, తెలంగాణ రైతాంగం నిరసనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి ప్రధాని మోదీకి తెలుసునని చెప్పారు. రైతుల ఉద్యమం ఉధృత రూపం దాల్చకముందే ధాన్యం కొనుగోళ్లలోనూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలతో మేలు జరగాలని కోరుకున్నాం:మంత్రి తోమర్
మూడు కొత్త వ్యవసాయ చట్టాల చట్టాల ప్రయోజనాల గురించి రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న ప్రధాని మోదీ ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. ’పార్లమెంటు ఆమోదించిన మూడు బిల్లులను ప్రధాని తీసుకొచ్చారు. వాటి వల్ల రైతులకు మేలు జరిగేది. రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ప్రధాని స్పష్టమైన ఉద్దేశం. కానీ దేశంలోని కొంతమంది రైతులకు ప్రయోజనాలను వివరించడంలో విఫలమైనందుకు నేను బాధపడ్డాను’ అని అన్నారు.అయితే రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర, పంటల వైవిధ్యీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారని వెల్లడిరచారు.