జేఎన్‌టీయూ ఘటన వెనుక లష్కర్ -ఏ- తోయిబా హస్తం
– రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
అలహాబాద్,ఫిబ్రవరి 14(జనంసాక్షి): ఢిల్లీలోని జేఎన్‌యూలో జరుగుతోన్న ఘటనల వెనుక లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిద్ హస్తం ఉందని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. వర్సిటీలో జరిగిన సంఘటనలన్నీ సయీద్ మద్దతుతో జరిగినవేనని స్పష్టం చేశారు. దీనిని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఇవాళ ఆయన అలహాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వర్సిటీలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా, రాజ్‌నాథ్ ఆరోపణలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలుంటే చూపించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం, మరో నేత డి.రాజా డిమాండ్ చేశారు.