జేపీసీ నివేదిక పూర్తికాలేదు: సిబాల్
న్యూఢీల్లీ: 2జి కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఇంకా పూర్తిలేదని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్ అన్నారు. ప్రస్తుతం వెలువడింది ముసాయిదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిని జేపీసీ ఆమోదించిన అనంతరమే పార్లమెంటులో ప్రవేశ పెడుతామన్నారు. పార్లమెంటులోనూ దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు.