జైసల్మేర్‌లో సైనికులతో.. మోదీ దివాళీ

న్యూఢిల్లీ,నవంబర్‌13 (జనంసాక్షి)  : ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్‌లో నిర్వహించనున్నారు. జైసల్మేర్‌లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రధాని మోదీ.. ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లో ఉన్న సైనికులతో జరుపుకుంటున్నారు. అయితే జైసల్మేర్‌లో జవాన్లను కలిసేవారిలో మోదీతో పాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కూడా ఉంటారు. గతంలో ప్రధాని మోదీ.. పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికుల్ని దీపావళి వేళ కలిశారు. జవాన్లకు మోదీ స్వీట్లు షేర్‌ చేశారు. గత ఏడాది రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఆర్మీ దళాలతో మోదీ దీపావళి జరుపుకున్నారు. 2018లో ఆయన ఉత్తరాఖండ్‌లో ఉన్న సరిహద్దు సైనికులతో గడిపారు. 2017లో ఆయన కశ్మీర్‌లోని గురేజ్‌ సెక్టార్‌ను సందర్శించారు. 2015లో దివాళీ వేళ .. ప్రధాని మోదీ పంజాబ్‌ సరిహద్దుల్ని విజిట్‌ చేశారు. 2014లో సియాచిన్‌ గ్లేసియర్‌లో ఉన్న సైనికులతో మోదీ దీపావళి జరుపుకున్నారు. శనివారం రోజున ఈ ఏడాది దీపావళి దేశవ్యాప్తంగా సెలబ్రేట్‌ చేసుకోనున్నారు.