జై జై గణేశా.. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

నాగార్జునసాగర్ (నందికొండ) జనం సాక్షి, (ఆగస్టు 31); వినాయక చవితి పర్వదినం వేడుకలను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సకల విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వాడవాడలా ఏర్పాటుచేసిన బొజ్జ గణపయ్య మండపాలలో భక్తులతో సందడి నెలకొంది. పైలాన్ కాలనీ టిఎస్ జెన్కో,గాంధీ బజార్,బిసి కాలనీ, టైగర్ కాలనీ, ఎండి టైప్, వివిధ ప్రాంతాలలో ప్రజలు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.చవితి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,వ్యాపార, వాణిజ్య సంస్థలు,ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను వేడుకగా నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తొమ్మిది రోజులపాటు నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో భాగంగా వాడ వాడల ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజలు పెరిగిన ఖర్చులను సైతం లెక్కచేయకుండా ఏర్పాటు చేశారు.  భక్తులను ఆకట్టుకునే విధంగా విభిన్న రూపాలలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఆకర్షణీయమైన విద్యుత్ లైట్ల ఏర్పాట్లతో ఏర్పాటుచేసిన గణనాధులను దర్శించుకోవడానికి ఉత్సవ నిర్వాహకులు మండపాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు.వినాయక విజయం ఇవ్వరావా,ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా విఘ్నేశ్వరుడు పూజల నేపథ్యంలో మొదటి రోజు గణేష్ మండపాల వద్ద పూజలు, అర్చనలు,సంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించాయి.చవితి పండుగ రోజు గణపతి విగ్రహాలు,పూజా సామాగ్రి కోసం వచ్చిన భక్తులతో మార్కెట్లలో సందడి నెలకొంది.చవితి పర్వదినం నేపథ్యం గణేష్ మండపాలు, ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులు, పట్టణ పెద్దలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజావార్తలు