జోగును ఢీకొననున్న గండ్రత్ సుజాత
రామచంద్రారెడ్డికి మళ్లీ మొండిచేయే
ఖానాపూర్ విషయంలో కానారాని స్పష్టత
ఆదిలాబాద్,నవంబర్13(జనంసాక్షి): ఎట్టకేలకు కాంగ్రెస్ టిక్కెట్ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాతకే దక్కింది. దీంతో ఆమె ప్రస్తు మంత్రి, టిఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నను ఢీకొనబోతున్నారు. మాజీమంత్రి సి.రామచంద్రారెడ్డి చివరి వరకు ప్రచయత్నం చేసినా వయసురీత్యా ఆయన పేరును పక్కన పెట్టారు. ఇకపోతే అనుకున్నట్లుగానే నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. సిర్పూర్లో పాల్వాయి హరీష్ బాబు,చెన్నూరులో వెంకటేశ్ నేత, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు,ముథోల్ రామారావు పటేల్‌లకు టిక్కట్లు దక్కాయి. ఇకపోతే ఖానాపూర్‌కు సంబంధించి రమేశ్ రాథోడ్‌కు టిక్కెట్ ఇస్తామనుకున్నా అక్కగ గొడవల క ఆరణంగా పక్కన పెట్టారని సమచారం. దీంతో జిల్లాలో సగం ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుబాటులో ఉన్నారని ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత పేర్కొన్నారు. ఇప్పటికే తమ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పథకం అమలుతో పాటు కౌలు రైతుల కష్టాలు తీరుస్తామని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెరాస ఎన్నికల హావిూలు విస్మరించిందన్నారు. అధికారంలోకి వస్తే పాత పథకాలు ఆరోగ్యశ్రీ, అభయహస్తం, బంగారుతల్లి, తదితర వాటితో పాటు కల్యాణలక్ష్మి పథకాన్ని యథావిథిగా కొనసాగిస్తామన్నారు. రిమ్స్‌ను గాడిలో పెట్టి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను అధికారంలోకి రాగానే చెల్లిస్తామని, అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామన్నారు. భాజపా, తెరాస అభ్యర్థులు శంకర్, రామన్నలు ఒక్కటేనని, ప్రచారంలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని ఆరోపించారు. ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు.