జోరుగా ఊపందుకున్న ఎన్నికలప్రచారం….
గడపగడపకూ నాయకుల తాకిడి.. హోరెత్తుతున్న గనులు..
కాకతీయఖని, జూన్ 17, (జనంసాక్షి) :
పరకాల ఉపఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి నాయకుల చూపు సింగరేణి గుర్తింపు ఎన్నికల వై పు మళ్ళింది. తమతమ పార్టీల అనుబంద కార్మిక సంఘలను గెలిపించుకోవాలనే పట్టుదలతో నాయ కులు ప్రచారం మొదలుపెట్టారు. ఏరియాలోని ఏ కాలనీలో చూసిన ఎన్నికల కోలహలమే, గడపగ డపకి తమతమ ఎన్నికలవాగ్దానాలతో, మేనిఫేస్టో లతో, కరపత్రాలతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏవాడలో చూసిన తమ సంఘాన్ని గెలింపించాలని కోరుతూ రోడ్డుకిరు ప్రక్కల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయా సంఘాల నాయకులు కార్మికులను తమవైపు తిప్పుకోవడానికి తమతమ వాగ్దాటితో కార్మికులను ఆకట్టుకుంటున్నారు. ఇతర సంఘాలనాయకులను కార్యకర్తలను తమ సంఘంలోకి రప్పించుకోవడా నికి, మచ్చిక చేసుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. కార్మికులను లోబర్చుకోవడానికి విం దులు, వినోదాల రూపంలో మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. వాడవాడలా మైకులతో కూడిన ఎన్ని కల శకటాలను తిప్పుతున్నారు. గనులవద్ద ప్రతి రోజు గేట్‌మీటింగ్‌లు, సంఘాలనాయకులు కార్మి కుల కుటీంబీకులను సైతం తమకు ఓటు వేయా లని అభ్యర్తించడం కనబడుతున్నది. దీంతో పాటు గనులు టబ్బులశబ్దాలకు బదులు మైకుల మోతతో మారుమ్రోగుతున్నాయి. ఆయా సంఘాల జెండా లతో గనులన్ని రంగులమయమైపోయాయి. సాధా రణ పరిస్ధితిలో కొంచెం అలజడిగా ఉండే గనులు ఇప్పుడు ఎన్నికల ప్రచారాలతో పండగ వాతా వరణం కనిపిస్తుంది. ఆదివారం సెలవుదినం కావడంతో కార్మికులను కలిసి ఓట్లను అభ్య ర్తించడం కోసం నాయకులు వాడవాడలా తిరుగు తున్నారు. ఐఎన్‌టియుసి నాయకులు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక క్రిష్ణాకాలనీలో ప్రచా రం నిర్వహిస్తు ఈ ఎన్నికల్లో తమసంఘాన్ని గెలి పించాలని కార్మికులను కోరారు. టిబిజికెఎస్ నాయకులు అప్పాని శ్రీనివాస్ ఆద్వర్యంలో మిలీని యంక్వార్టర్సులో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెలంగాణ సాధించుకుంటేనే సింగ రేణిని అభివృద్ది చేసుకోవచ్చని, వనరులను మనం కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు ఎన్ని కల్లో టిబిజికెఎస్‌ను ఆదరించాలని కార్మికులకు అప్పాని శ్రీనివాస్ విజ్ఞప్తిచేశారు. ఏఐటియుసి నాయకులు మోటపలుకుల రమేష్ ఆధ్వర్యంలో సుభాష్‌కాలనీలో ఇంటింటా ప్రచారాన్ని కొన సాగించారు. ఇన్ని సంవత్సరాలు గుర్తింపు హో దాలో ఉండి ఎన్నో హక్కులను సాధించామని అది సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి తెలుసు నని ఇన్నిసంవత్సరాలు చేసిన పోరాటాలే మా ఎన్నికల ప్రచార అస్త్రాలని రమేష్ అన్నారు. ఇలా ప్రతిరోజు ఎన్నికల కోలాహలంతో ఏరియా అంతా సందడిసందడిగా కొనసాగుతుంది. ఇకఈసారి ఎన్నికల్లో కార్మికులు ఏసంఘానికి పట్టంకడతారో వేచిచూడాల్సిందే……….