జ‌నంసాక్షినాకు సంపాదించే ఆలోచనే లేదు

కేవలం ఖానాపూర్‌ ప్రజల సేవ చేయడమే లక్ష్యం

కొత్త రాగం అందుకున్న రాథోడ్‌ రమేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పార్టీ మారడంతో ఇప్పుడు ప్రచార వ్యూహాలు కూడా మారుతున్నాయి. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చి…ఇప్పుడు టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించిన ఖానాపూర్‌ కాంగ్రెస్‌ రాథోడ్‌ రమేశ్‌ కూడా స్థానిక అంశాలను కొత్తగా ప్రచారంలో చేపట్టబోతున్నారు. గతంలో ఎంపిగా, స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసినా పెద్దగా పట్టించుకోని రాథోడ్‌ ఇప్పుడు మళ్లీ వాటిని కొత్తగా

చూపబోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆశలు లేవనే చెప్పారు. భార్యా పిల్లలు అంతా సెటిలయ్యారు. ఇక మిగిలింది ప్రజా సేవచేయడమే అన్న పల్లవినీ అందుకున్నారు. ఎంపీగా వెళ్లే అవకాశం ఉన్నా వదులుకున్నాను. కేవలం ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజలపై ఉన్న మక్కువతోనే ఎమ్మెల్యేగా బరిలో నిలిచానని కొత్త ఇమేజ్‌ సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారు.తన పిల్లలంతా స్థిరపడ్డారని, తనకు సంపాదించాలనే ఆలోచన లేదని, తన జీవితం ఖానాపూర్‌ నియోజకవర్గానికే అంకితం చేస్తున్నాని అన్నారు. మేడంపల్లి వద్ద సదర్మాట్‌ ఆనకట్టకు భూమిపూజ చేస్తే, దాన్ని నిర్మల్‌ నియోజకవర్గానికి తరలించి, అటు జగిత్యాలలోని రేఖానాయక్‌ గ్రామానికి, తరలించుకుపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రేఖానయాక్‌ లోకల్‌ కాదని చెప్పడమే ఆయన ప్రధాన లక్ష్యం. బ్యారేజీ నుంచి సదర్మాట్‌ వరకు నిర్మించాల్సిన ప్రత్యేక కాలువ తన ప్రధాన లక్ష్యం అన్నారు. ఏడు కిలోవిూటర్ల పొడవున్న ఈ కాలువ నిర్మాణం చేపట్టి, కడెం, ఖానాపూర్‌ రైతాంగానికి నీళ్లు వచ్చేలా చూస్తానని చెప్పి రైతులకు భరోసా ఇచ్చారు. అందరూ పార్టీ గెలుపు కోసం కలిసి రావాలని కోరారు. మొత్తంగా మరోమారు రాథోడ్‌ రమేశ్‌ అటుతిరిగి ఇటుతిరిగి కాంగ్రెస్‌ ద్వారా మరోమారు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబుతన్నారు.