టర్కీలో జంట పేలుళ్లు..

turkey-blastటర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ముఖ్య నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట పేలుళ్లలో 38 మంది మృతిచెందగా.. 166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్‌ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు. తొలి పేలుడు ఫుట్‌బాల్‌ స్టేడియం బయట.. రెండోది ఓ పార్క్‌ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా.. రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.