టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం
– రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు
ఇస్తాంబుల్,అక్టోబరు 30(జనంసాక్షి): టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునావిూ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపం ధాటికి ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి విూడియా వర్గాలు పేర్కొన్నాయి.ఏజియన్ సముద్రంలో 16.5 కిలోవిూటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు అమెరికా జియోలాజిక్ సర్వే పేర్కొంది.ముఖ్యంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. భూంకంపం కారణంగా సంభవించిన చిన్నపాటి సునావిూతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం లేదని ఇజ్మిర్ గవర్నర్ తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఇస్తాంబుల్ గవర్నర్ పేర్కొన్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌కు చెందిన ద్వీపం సామోస్‌లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.