టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే గ్రామాల అభివృద్ది
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్,మే4 (జనంసాక్షి): పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ఆభ్యర్థులకే ఓటు వేయాలని,కాంగ్రెస్,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లభూత్కూర్,తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి అభ్యర్థి పురమల్ల లలిత శ్రీనివాస్ తో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని ఆభ్యర్థించారు. మండలంలోని బహూదూర్ ఖాన్ పేట గ్రామంలో శనివారం టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలిత శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తు వేయాలని,స్థానిక ఆభ్యర్థి పురమల్ల లలిత శ్రీనివాస్‌కు ఓటు వేసి టిఆర్‌ఎస్ గెలిపించాలని ఓటర్లను ఆభ్యర్థించారు. కరీంనగర్ ,కొత్తపల్లి మండలాల 2 జడ్పీటిసి,2 ఎంపిపిలను కైవసం చేసుకుంటామని అన్నారు. శాసన సభ నుంచి పరిషత్ ఎన్నికల పరకు అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ ఉంటేనే అభివృద్ది వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నాణ్యమైన కరెంట్‌ను ఇవ్వలేదని,కరెంట్ లేక మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయాన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మారిపోయిందని,రైతు బంధు,రైతు భీమా,24 గంటల కరెంట్,రైతు రుణా మాఫి, ఆనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతుల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్ ఎంపిటిసి ,జడ్పీటిసి ఆభ్యర్థులను ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి వాసాల రమేష్, సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్,నాయకులు కాసెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.