టిఆర్‌ఎస్‌కు షాక్..బిజెపిలో చేరనున్న మోహన్ రెడ్డి
నిజామాబాద్,జూలై27(జనంసాక్షి ): అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మోహన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇటీవల ఢల్లీిలో బీజేపీ ముఖ్య నేతలను మోహన్ రెడ్డి కలిశారు. ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణలో మోహన్ రెడ్డి కీలకంగా పని చేశారు. టీఆర్‌ఎస్ నేతల వైఖరి నచ్చకపోవడంతో మోహన్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.