టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది
ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్,నవంబర్13(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం కూడా మంత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గతంలోని ప్రభుత్వాలు చేసిన పాలనా వైఫల్యాలను తెలియజేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్ వల్లనే జరిగిందన్నారు. అధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటేసి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారిని పార్టీలోకి స్వాగతించారు. ఇదిలావుంటే జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. నియోజకవర్గాల్లో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి బీ ఫాం లు అందుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు మరకోమారు ప్రచారం కొనసాగించారు. మహాకూటమిలో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నేతలు చంద్రబాబు చుట్టూ తిరుగడం సిగ్గుచేటని ఢిల్లీ, అమరావతి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పుట్టిన టీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ ప్రజల ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సీమాంధ్ర పాలకు లు అరవై ఏళ్లలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసిందన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి పేదల ఖాతాల్లో వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను మోసం చేశారని మంత్రి
పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబస్తీ, అమ్మఒడి, కేసీఆర్‌కిట్‌తో పాటు ఇతర పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు సా ధించి అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అందరికీ ప్రయోజనం చేకూర్చాయని, దేశంలో ఎక్కడా లేని అ భివృద్ధి తెలంగాణలో జరిగిందని తెలిపారు. అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతిపక్షాల నాయకులను గతంలో వారు చేసిన అభివృద్ధిపై ప్రజల నిలదీయాలని కోరారు.