టిటిడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్‌ రెడ్డి
తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గో పరి రక్షణతో పాటు గో ఆధారిత పదార్దాలతో.. టీటీడీ వస్తువులను తయారు చేయడం అభినందనీయమన్నారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పర్యాటకరంగం దెబ్బతిన్నదని, పర్యాటక అభివృద్ధికి రాష్టాల్రకు కేంద్రం చేయూతనంది స్తుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయంగా పర్యాటకానికి ప్రోత్సాహలను అందిస్తామన్నారు. దేశంలో 15 ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రజలు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడిరచారు. అంతకుముందు కిషన్‌ రెడ్డి దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.