టిడిపిజెండాలు పట్టుకున్నారని దాడి

పోలీసుల ఎదుటే వైసిపి వారు దాగి చేశారు: జివి
గుంటూరు,మార్చి9(సూర్యనారాయణుడిని తాకని కిరణాలు
నిరాశతో వెనుదిరిగిన భక్తులు
శ్రీకాకుళం,మార్చి9(జనం సాక్షి): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశ ఎదురైంది. ప్రతియేట మూలవిరాట్‌ను తాకే సూర్య కిరణాలు ఈసారి నిరాశ పరిచాయి. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల కారణంగా ఏటా మార్చి 9,10 తేదీల్లో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా అక్టోబర్‌ 1, 2 తేదీల్లో కూడా పాదాల నుంచి శిరస్సు వరకు సూర్యకిరణాలు తాకడాన్ని వీక్షించేందుకు భక్తులు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మంచు కారణంగా సూర్యకిరణాలు స్వామివారిపై పడకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్ద గంజాంలో భావన్నారాయణ స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. ఇక్కడ కూడా ఏటా మార్చి, అక్టోబర్‌ మొదటి వారాల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు తరలి వచ్చారు.