టిపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ కు ఘన సన్మానం

కురవి అక్టోబర్ -8 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం లింగ్యాతండా గ్రామంలో మాలోత్ నెహ్రూ నాయక్ టీపీసిసి సభ్యలుగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారి తన స్వగ్రామం వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి,శాలువతో ఘనంగా సన్మానించిన కురవి మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.ఈ సందర్భంగా మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ నన్ను ఇంతలా ఆదరిస్తున్న డోర్నకాల్ నియోజకవర్గ ప్రజలకు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటా నా అడుగు ప్రజలతోనే అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల బాద్యులు వద్దుల మహేందర్ రెడ్డి,మండల నాయకులు శ్యామల శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మాలోత్ హారిలాల్,మండల నాయకులు రాజపుత్, ఎడ్ల వెంకన్న ,సోషల్ మీడియా ఇంజార్జ్ గుగులోత్ నవీన్ చందులాల్,లక్ష్మయ్య,మల్లయ్య, రాందాస్,కొత్త వెంకన్న, లాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.