టిఫిన్ బయటక్ కార్యక్రమంలో ఇల్లందు బీజేపీ శ్రేణులు
భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఫిన్ బైటక్ కార్యక్రమం ఇల్లందు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణ పెంచడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంక్ష ఉన్నప్పటికీ ప్రజలకు చేరువ కాకుండా అసాధ్యమని,జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉన్నందున మనం కూడా క్షేత్ర స్థాయి లో పార్టీని బలోపేతం చేసుకుని విజయం దిశగా ముందుకు సాగాలని త్వరలో పార్టీలో భారీగా చేరికలు ఉన్నాయని అందుకై రాష్ట్ర నాయకులు రాబోతున్నారని ఇట్టి చేరికల కార్యక్రమాలను కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓ బి సి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మావునురి మాధవ్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ..పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిరియాల వెంకటేశ్వర రావు,శాసనాల రామయ్య,దోమల మహేష్,పట్టణ ప్రదాన కార్యదర్శి రెవల్ల నాగరాజు, కార్యదర్శులు ఎం.శ్రీనివాస్,దన్ను ఉపాధ్యక్షులు శివకుమార్ ఖండెల్వల్, బొడ సురేందర్ నాయక్ జిల్లా ఓ బి సి కార్యదర్శి రాహుల్ మహదేవ్,పట్టణ ఓ బి సిఅద్యక్షులు వంశిధర్ గౌడ్, బీజేవైఎం పట్టణ అద్యక్షులు సందీప్ నాయుడు,రవి లోధ్,నరసింహ రెడ్డి నాయకులు డీ ఆర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.