టి టిడిపి అధ్యక్షుడిగా మళ్లీ రమణ
విజయవాడ,సెప్టెంబర్30(జనంసాక్షి): జాతీయపార్టీగా ప్రకటించుకున్న తెలుగు దేశం పార్టీకి పూర్తిస్థాయి కమిటీలను పార్టీ కేంద్రకమిటీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర కమిటీలోకి తనయుడు లోకేశ్‌ను తీసుకున్నారు. అలాగే కీలక నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరోలోకి కూడా లోకేశ్‌ను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నామినేట్ చేశారు. మొత్తంగా లోకేశ్‌కు పార్టీలో పెద్ద పీట వేసే ప్రయత్నం చేశారు. అలాగే బావమరిది హరికృష్ణను పోలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. కమిటీల్లో తెలంగాణ నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రకమిటీ, రెండు రాష్ట్ర కమిటీలను నియమించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కమిటీల వివరాలను చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణను కొనసాగించగా, రేవంత్‌ను వర్కింగ్ ప్రసిడెంట్‌గా నియమించారు. అలాగే ఎపి కమిటీ అధ్యక్షుడిగా మాజీమంత్రి కళా వెంకట్రావు నియమితులయ్యారు. మొత్తం 17 మంది సభ్యులతో కేంద్ర పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేష్ రాథోడ్, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు నియమితులయ్యారు. అలాగే పోలిట్‌బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నారా లోకేశ్, సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్.రమణ ఉంటారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి మోహనరావు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, డి.కె.సత్యప్రభను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ ఉంటారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధులుగా కింజారపు రామ్మోహన్‌నాయుడు, అరవింద్‌కుమార్ గౌడ్, బోండా ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, పెద్దిరెడ్డి నియక్తులయ్యారు. కేంద్ర విూడియా కమిటీ సమన్వయకర్తగా ఎల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, కేంద్ర కమిటీ కార్యాలయ కార్యదర్శిగా టి.డి.జనార్థన్. కేంద్ర పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌గా వి.వి.వి.చౌదరి నియమితులయ్యారు. కేంద్రకమిటీ కోశాధికారిగా శిద్దా రాఘవరావు, కేంద్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌గా ఎం.ఎషరీఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా అరికెల నర్సారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో 70 మందికి స్థానం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు,ఉపాధ్యక్షులుగా కరణం బలరాం, జె.ఆర్ పుష్పరాజ్, మెట్ట సత్యనారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, వెంకటేశ్వర చౌదరి, ప్రధాన కార్యదర్శులుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు, బి.వి.జయ నాగేశ్వర్‌రెడ్డిలు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర అధికార ప్రతినిధులుగా వై.వి.బి రాజేందప్రసాద్, డొక్క మాణిక్య వరప్రసాద్, ముళ్లపూడి రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచుమర్తి అనూరాధ, మ్లలెల లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్లు నియిమితులయ్యారు. రాష్ట్ర శాఖ కోశాధికారిగా బి.సి జనార్థన్‌రెడ్డి. కార్యాలయ కార్యదర్శి గా ఏవీ రమణ నియమితులయ్యారు.కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ కు కూడా అధికార ప్రతినిధి ¬దా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర కమిటీ
13 జిల్లాలు ఉన్న ఎపికి 70 మందితో కమిటీ వేయగా 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొత్తం 93 మంది సభ్యులతో టిడిపి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణను కొనసాగిస్తూనే వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా మండవ వెంకటేశ్వరరావు, సాయన్న, అన్నపూర్ణమ్మ, వంగాల స్వామి గౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేశ్‌రెడ్డి, కృష్ణయాదవ్, అరికపూడి గాంధీలను నియమించారు.ప్రధాన కార్యదర్శులుగా కొత్తకోట దయాకర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీతక్క,కె.పి. వివేక్ గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, రజనీకుమారి, నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, సతీష్‌మాదిగ, అమర్‌నాథ్ బాబులు నియమితులయ్యారు. రాష్ట్ర కోశాధికారిగా ప్రేమ్‌కుమార్ జైన్. విూడియా కమిటీ కన్వీనర్ ఎం.ఎ సలామ్. విూడియా కమిటీ సభ్యులుగా ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వీరేందర్‌గౌడ్, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభారాణి నియమితులయ్యారు.