టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో నేడు డీఎస్ఈ ముట్టడి

పెన్ పహాడ్.జులై 26 (జనంసాక్షి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్ గా నేడు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ముట్టడించనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్ తెలిపారు.మంగళవారం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అన్నారం(ఎన్)లో డిఎస్ఈ ముట్టడికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. పదోన్నతులు లేక ఉపాధ్యాయులు పాత క్యాడర్ లోనే రిటైర్ అవుతున్నారని అన్నారు.ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్న విద్యార్థులకు పూర్తిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదన్నారు. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నేడు తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం అనిత, దశరధ రామారావు, సత్యనారాయణ, రజియాసుల్తాన, శ్రీనివాస్ , షబానా తదితరులు పాల్గొన్నారు.