టీఆర్‌ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారు-ఉత్తమ్
హైదరాబాద్,ఆగస్టు28 : టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సర్కారు కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం విద్యుత్ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ గతంలో చంద్రబాబు లాగానే ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం అంశాల వారీగా పార్టీలతో కలిసి నడుస్తామని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. వ్యవసాయ నాయకత్వ అవార్డు కేసీఆర్ కు ప్రయివేటు సంస్థ ఇవ్వడం తెలంగాణ ప్రజలని అపహాస్యం చేయడమేన్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేసీఆర్ కు అవార్డు ఇవ్వడం సరికాదని ఉత్తమ్ అన్నారు.