టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం పట్ల హర్షం
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి) : టీఎస్ఆర్‌టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల నూతనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎల్ నాగేశ్వరరావు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి డిమాండ్ ను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం, త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు.ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చబోతున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వారు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు.ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీని విలీనం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవి బాధ్యతలు చేపట్టాక పలు సంస్కరణలు, పథకాలతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువతో పాటు ఆదరణ పెరిగిందన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.