టీఎస్ సిపిజెట్ ఫలితాల్లో గరిడేపల్లి విద్యార్థి మొదటి ర్యాంక్
గరిడేపల్లి, సెప్టెంబర్ 26 (జనం సాక్షి); టీఎస్ సిపిజెట్ పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మామిడి సత్యనారాయణ కూతురు మామిడి దుర్గ భవాని ఎంఏ ఫిలాసఫీ యందు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు పొందారు. గరిడేపల్లి విద్యార్థి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడంతో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థి దుర్గ భవానికి అభినందనలు తెలియజేశారు.