టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం
టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌
నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి):
కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని టిఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా టిడిపి, కాంగ్రెస్‌ నేతలే అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల 60సంవత్సరాల ఆకాంక్ష అని తెలంగాణాను గుర్తు చేశారు. సోమవారం నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం రూట్‌ మ్యాప్‌ను త్వరలో కేంద్రం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, టిడిపి, చిరంజీవి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకట్టవేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. 56 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రా వలస పాలకుల వల్ల తెలంగాణ రావడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి ఎంతో మంది విద్యార్థులు,మేధావులు ఆత్మహత్యలకు పాల్పడ వారి శవాలపై రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే చివరి పోరాటంలో విద్యార్థులు కీలక పాత్రను పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా బతికుండి తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కలిసి ఉన్న పార్టీలకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్‌ ఉంటుందని ఆయనఅన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్‌ బిట్రిష్‌ వారితో ఎలా పోరాడి గెలిచారో నేటి విద్యార్థులు కూడ తెలంగాణ కోసం పోరాడాలని, సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి తెలంగాణ జెండా తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. విశిష్ట అతిధిగా హాజరైన టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని ఆయనకొనియాడారు. గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, తెలంగాణవాదులు రోడ్డెక్కి తమకు తెలంగాణకావాలని గొంతెంతి ఆరిచిన వారిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనల వల్లే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యతవహించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రోజుకు ఎదో ఒక అవినీతి బయటపడుతుందని ఇలాంటి ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుందన్నారు. ఎల్లారెడ్డిఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం తాను రాజీనామా చేసినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేశారు. వారి ఆకాంక్ష కోసం తెలంగాణరాష్ట్రంకోసం అలుపెరుగని పోరాటం చేస్తామని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి, అర్బన్‌ ఇన్‌చార్జి ఎఎస్‌. పోశెట్టి, ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాల అధినేత మారయ్యగౌడ్‌, టిజివిపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరి, రమేష్‌, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రవి, సుజిత్‌సింగ్‌ఠాగూర్‌, శ్రీనివాస్‌రెడ్డి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు