టీడీపీ కేంద్రకమిటీ అధ్యక్షుడిగా బాబు ప్రమాణం
హైదరాబాద్‌అక్టోబర్ 04 (జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర కమిటీ సభ్యులు, ఆయా రాష్గాల కమీటీ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. సీనియర్ నేతలు నందమూరి హరికృష్ణ, అశోక్‌గజపతిరాజు, సుజనాాదరి, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ళ్ణడు, శిద్దా రాఘవరావు, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి తెదేపా శ్రేణులు భారీగా హాజరయ్యారు.