టీడీపీ నేతల్లో ఓటమిభయం పట్టుకుంది

– బాబుపై ఆ పార్టీలోని ఓ వర్గానికి నమ్మకం సన్నగిల్లింది
– వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి
హైదరాబాద్‌, మే3(జ‌నంసాక్షి) : టీడీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని, లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని, ఎన్నికలకు ముందు ఈవీఎంలు వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసునన్నారు. బాబు అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని ఆరోపించారు. ఆయన విడుదల చేసిన ఆడియో.. గ్యాంబ్లింగ్‌ ప్రోత్సహించేలా ఉందన్నారు. సీఎం ¬దాలో ఉండి సట్టా మార్కెట్‌, మట్కాలపై ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డీజీపీ ఠాకూర్‌పై వైసీపీ అనేక ఫిర్యాదులు చేసినా బదిలీ చేయలేదన్నారు.రాష్టాన్న్రి ఐదేళ్ల పాలించిన చంద్రబాబు.. వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించారన్నారు. సొంత ప్రచారం కోసం ప్రజల సొమ్మునుకాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాలు కేంద్రంలో కలిసుండి నిధులు తెచ్చుకోలేక పోయిన చంద్రబాబు, చివరి సంవత్సరంలో బీజేపీపై పోరాటమంటూ ఏపీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు మోసాలను గమనించిన ప్రజలు ఓట్లతో తగిన బుద్దిచెప్పారని, ఆ ఫలితాలు 23న తేటతెల్లమవుతాయని శ్రీకాంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, సీఎంగా వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని అన్నారు. రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని, పక్షపాత దోరణి లేకుండా పాలన సాగుతుందని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.