టీమిండియా హ్యాట్రిక్ విజయం
పెర్త్,ఫిబ్రవరి28 : ప్రపంచ కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో నాకౌట్‌కు చేరువవుతోంది. న్యూజిలాండ్ తరవాత ఇప్పుడు టీమిండియా హవా కొనసాగించింది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెత మేరకు తాజాగా ధోనీసేన పసికూన యూఏఈపై 9 వికెట్లతో అలవోక విజయం సాధించింది. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్లో 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత18.5 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ (33 నాటౌట), ధవన్ 14 పరుగులు చేశారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ధావన్ (14) .. మహ్మద్ నవీద్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు. ఆ ఆ తర్వాత రోహిత్, కోహ్లీ మరో వికెట్ పోకుండా జట్టును గెలిపించారు. అంతకుముందు భారత బౌలర్లు యూఏఈని 31.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ చేశారు. యూఏఈ జట్టులో సెమైన్ అన్వర్ (35) టాప్ స్కోరర్. అన్వర్తో పాటు ఖుర్రంఖాన్, గురుగె మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలినవారు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట చేరారు. భారత బౌలర్లు అశ్విన్ 4, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రపంచకప్‌లో భారత్ కు ఇది వరుసగా మూడో విజయం. పాకిస్థాన్, సౌతాఫ్రికాలపై ఇప్పటికే విజయం నమోదు చేశారు. శనివార్‌ం పెర్త్‌లో యూఏఈపై భారత్ ఘన విజయం సాధించింది. 102 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అవలీలగా చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ అన్ని వికెట్ల నష్టానికి 31.3 ఓవర్లలో 102 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు.
మరో మూడు మ్యాచ్‌లు..మరో హ్యాట్రిక్
ప్రపంచ కప్ ఆరంభానికి ముందు టీమిండియాపై పెద్దగా అంచనాల్లేవు. భారత్ డిఫెండింగ్ చాంపియనే అయినా ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఆస్టేల్రియా పర్యటనలో ఘోరంగా విఫలం కావడమే కారణం. అయితే ప్రపంచ కప్లో భారత్ ఒక్కసారిగా పుంజుకుంది. బ్యాటింగ్లో బలంగా ఉన్న ధోనీసేన బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ ఎంతో మెరుగుపడింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధిస్తోంది. ధోనీసేన హ్యాట్రిక్ విజయంతో దాదాపుగా నాకౌట్ బెర్తు సాధించింది. గ్రూపు-బి టాపర్గా ఉన్న టీమిండియా లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడనుంది. పసికూనలు ఐర్లాండ్, జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో ఆడాల్సివుంది. భారత్ ఇదే జోరు కొనసాగించి డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా? ఓటమే లేకుండా నాకౌట్కు చేరుతుందా? అన్నది ఆసక్తికరమైన అంశం.ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తుంటే.. వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలపై నెగ్గడం పెద్ద కష్టమేవిూ కాకపోవచ్చు. విండీస్ ఆటతీరు అనిశ్చితిగా ఉంది. జింబాబ్వేపై రికార్డుల మోత మోగించిన విండీస్.. ఆ వెంటనే సఫారీల చేతిలో ఘోరపరాభవం మూటగట్టుకుంది. ఇక పసికూనలు జింబాబ్వే, ఐర్లాండ్ ఆశించిన స్థాయిలో రాణిస్తున్నా.. టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడితే వీటితో పెద్దగా సవాల్ ఎదురుకాకపోవచ్చు. పూల్-బిలో ఉన్న ధోనీసేన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. ఆ తర్వాత పటిష్టమైన దక్షిణాఫ్రికాపై అంచనాలకు మించి రాణించింది. సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ భారీ విజయాలు నమోదు చేయడం విశేషం. మనోళ్లు మ్యాచ్లను ఏకపక్షంగా మార్చేశారు. ఇక పసికూనలు యూఏఈపై అయితే తిరుగేలేదు.