టీవీ స్టేషన్‌పై దుండగుల దాడి.. 100 మంది మృతి?
కాబూల్: అఫ్టనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ స్టేషన్లో దుండగులు దాడికి పాల్పడ్డారు. ‘శంషాద్’ టీవీ స్టేషన్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. టీవీ స్టేషన్‌పై గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో, ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది ఈ దాడికి పాల్పడ్డారనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో 100మంది వరకూ ఉద్యోగులు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.