టూత్‌బ్రష్‌తో అంటువ్యాధులు

akshaaa

న్యూయార్క్: మీరు ఉమ్మడి బాత్‌రూమ్ వాడుతున్నారా? అయితే మీ టూత్‌బ్రష్‌ను బాత్‌రూమ్‌లోని స్టాండ్స్‌లో ఉంచే విషయంలో కాస్త ఆలోచించండి. ఎందుకంటే దాని ద్వారా మీకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. సాధారణంగా ఎక్కువ మంది వాడే బాత్‌రూముల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బాత్‌రూమ్‌లో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల కంటే ఇది కలిగిన బాత్‌రూమ్‌ల్లో టూత్‌బ్రష్‌లను నిల్వ చేయడం వల్ల అది మనకు వ్యాపించవచ్చు.

దీని వల్ల అంతకుముందు మనలో లేని బ్యాక్టీరియా ప్రభావానికి గురవుతామని అమెరికాలోని క్విన్నిపియాక్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులు టూత్‌బ్రష్‌ను వినియోగించడంలో, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కలుగుతుంది.