టెక్సాస్‌లో పేలుడు, వందమందికి గాయలు

టేక్సాస్‌: అమెరికాలో మరో పేలుడు సంభవించింది. టెక్సాస్‌లొని ఓ ఎరువుల కంపెనీలో భారీ పేలుడు జరడటంతో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ పేలుడు జరిగింది. గాయపడిన వారిని సమీప ఆప్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో చాలామందికి ఎములు విరిగినట్లు ఆస్పత్రి వైధ్యులు తెలిపారు.
కాగా ఈ ఘటనలో 70మందికి వరకూ మృతి చెంది ఉంటారని ఆనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగె ప్రమాదాముందని అంచనా. ఇటు బాదితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల నల్టటి పొగలు అలుముకున్నాయి. అయితే, ఈ పేలుడు ఎందుకు, ఎలా జరిగిందో ఇంకా తెలియలేదు. మరోవైపు గాయపడిన వారిని హూటాహూటిన సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.