టెక్సాస్ కాల్పుల ఘటనపైస్థానికుల షాక్
28మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది
టెక్సాస్,నవంబర్6(జనంసాక్షి): టెక్సాస్ చర్చిలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఓఉన్మాది కాల్పులకు 28మంది లో 28 మంది అమాయక ప్రజలు బలయ్యారు.
ఇలాంటి దాడి జరుగుతుందని కలలో కూడా వూహించలేదని, టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అక్కడి స్థికుల ఆవేదనగా ఉంది. టెక్సాస్‌లోని ఓ చర్చిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయక ప్రజలు బలయ్యారు. సుదర్‌ల్యాండ్ అనేది చిన్న ప్రాంతమని.. అసలు అమెరికా మొత్తంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరుగుతాయేమో కానీ ఈ ప్రాంతంలో మాత్రం జరగవని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది చర్చిలోకి వచ్చి అంతమందిని కాల్చి చంపాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఉద్వేగానికి లోనయ్యారు. లాంటి దాడులకు పాల్పడి పసి పిల్లల్ని పొట్టన పెట్టుకుని ఉగ్రవాదులు ఏం సాధించాలను కుంటున్నారో అర్థం కావడంలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ దాడుల్లో లీ అనే మహిళ తన చిన్నారిని పోగొట్టుకుంది. ఇప్పటివరకు చిన్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులు జరగవు అనే నమ్మకంతో జీవించేవాళ్లమని కానీ నేడు ఆ నమ్మకం కూడా లేకుండాపోయిందని అక్కడి వాసులు వాపోతున్నారు. టెక్సాస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని సదర్‌ల్యాండ్ స్పిం/-రగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 28 మంది మృతి చెందగా… 20 మందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. దుండగుడి వద్ద ఉన్న అసాల్ట్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించినట్లు పేర్కొన్నారు.
దుండగుడు 26 ఏండ్ల డెవిన్ పాట్రిక్ కెల్లీ అంటూ.. ఎయిర్ ఫోర్స్‌లో తనను అవమానించి.. సస్పెండ్ చేసినందుకే కెల్లీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని యూఎస్‌కు చెందిన కొన్ని విూడియా సంస్థలు వెల్లడించాయి. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల బీభత్సంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ట్రంప్ తెలిపారు.