టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కమల్‌ రాజు చెప్పారు. కేజీ టూ పీజీ ప్రవేశపెట్టేందుకు దశలవారీగా గురుకుల పాఠశాలలను మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ దశలో అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేసి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించాలని, ఎవరూ కూడా ఫెయిల్‌ కావోద్దని పేర్కొన్నారు. గతేడాది పదిలో సాధించిన ఉత్తీర్ణతా శాతం వివరాలు తీసుకుని మరింతగా ఫళితాలు రాబట్టాలని అన్నారు. అవసరమైతే పదోతరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఆందోళన లేకుండా పది పరీక్షలు రాసేలా చేయాలని, అందుకు అవసరమైన శిక్షణ విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.