టేకులపల్లి మండలం నుండి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభలుకు తరిలిన విద్యార్థి సంఘం నాయకులు

టేకులపల్లి,ఆగస్టు 26( జనం సాక్షి):
భద్రాది జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో ఆగస్టు 26 నుండి మూడు రోజులపాటు జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలకు టేకులపల్లి మండలం నుండి విద్యార్థులు భారీ ర్యాలికి, భహిరంగసభ కు తరిలివెళ్లారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ నాయకులు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు గుగులొత్ రాంచందర్,ఐతా శ్రీరాములు, కర్లపూడి సుందర్ పాల్గజ్వరంతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే విధంగా ఉందని,ప్రైవేటు కార్పోరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా చేసుకునే వీలుగా జాతీయ విద్యావిధానం ఉందన్నారు. విద్యాకాశాయీకరణకు అనుకూలంగా, విశ్వవిద్యాలయాల విద్యను ప్రభుత్వరంగం నుండి దూరం చేసి కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రూ.5,574కోట్లు ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల కావాల్సి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవడంతోనే ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు.ఈ రాష్ట్ర మహాసభలకు 33 జిల్లాలు,17 విశ్వవిద్యాలయాల నుండి 700 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని టేకులపల్లి మండలం నుంచి పది మంది ప్రతినిధులు గా పాల్ల్గోంటున్నారని తెలిపారు. మొదటి రోజు విద్యార్ధి ప్రదర్శన,బహిరంగ సభ ఉంటుందని,రెండు,మూడు రోజుల్లో ప్రతినిధుల సభ అమరజీవి గజ్జెల సందీప్ నగర్, కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించనున్నట్లు వారు అన్నారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర జాతీయ నాయకులు వస్తారని అన్నారు. ఎఐఎ�

తాజావార్తలు